బాలల కోసం "స్వామీ వివేకానంద" సూక్తులు.:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 76) నాయకులు శీలవంతులు కాకపోతే అనుచరులు విధేయులు కావడం సాధ్యం కాదు.నాయకునికి శీలం పవిత్రమైన కొద్దీ అనుచరుల విశ్వాసమూ, విధేయత పెంపొందుతాయి.
77) నిస్వార్థులైన కొందరిని నాకు ఇవ్వండి.ఈ ప్రపంచగతినే మార్చివేస్తాను.
78) లక్ష్యశుధ్ధి,చిత్తశుధ్ధి ఇవే విజయానికి తోబుట్టువులు.
79) ప్రేమ,నిజాయితీ,పవిత్రత  ఉండే వారిని ఈ ప్రపంచంలో ఏశక్తీ ఓడించలేదు.
80) మానవునిలో దివ్యత్వాన్ని వ్యక్తపరచడమే మతం.
(సశేషము)

కామెంట్‌లు