గాంధీ జయంతి సందర్భంగా.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 మట్టి నుండి మాణిక్యాలను పుట్టించినవాడు మహాత్ముడు.
హిందూ, ముస్లిం భాయి భాయి అంటూ జాతి సమైక్యత కోసం
మన దేశం పురోగతి సోపానాలు వేసిన మహనీయుడు.
హింస కన్నా అహింస శక్తి కలదని
అసత్యం కన్నా సత్యం నిత్యమైన దాని హింస అసత్యాలు నిత్యము
హత్యా రాజకీయాలతో మత కులాలతో మైల పడిపోతున్నాయి.
అంటూ నగ్నసత్యాన్ని విడమరిచి
చెప్పిన జాతిపిత గాంధీజీ
కు తంత్రాన్ని ఛేదించి స్వాతంత్రాన్ని సాధించి
త్యాగనిరతి ని బోధించి
సర్వమత సమానత్వానికి
సమతా మమతలు పంచి
పర దాస్య శృంఖలా లను తెంచి
నాటి మహనీయుల త్యాగఫలం మనకందరికీ పంచి
మన భారత మాత బిడ్డ పరమపితా గాంధీ తాత
ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుద్దాం
గాంధీ మార్గం.
కఠోరమైన క్రమశిక్షణ గాంధీజీకి ఆరో ప్రాణం. వ్యక్తిత్వ అ వికాసానికి ఆయన మార్గ సూత్రాలు 10.
మితభాషిత్వం, ఇతరులు చెప్పిన విషయాలను ఆలోచించి ఆచరించటం.
కాలయాపన చేయకూడదు.
సమయపాలన పాటించాలి.
నిరాడంబరతను పాటించాలి.
ఖర్చుపెట్టే ప్రతి పైసా లెక్క పెట్టాలి. నీ సంపదకు నీవు ధర్మకర్త మాత్రమే.
ప్రతివారు ప్రార్థన అలవాటుగా చేయాలి.
వ్యాయామం చేయాలి.
మిత భోజనం బ్రతకటానికి తినాలి.
దినచర్యను రాయాలి.
మేధ కంటే హృదయం గొప్పది.
మీ జీవిత కాలంలో మీకు తారసపడిన దరిద్రుడు ని, బలహీనుణ్ణి ఒకసారి ఇ తలచుకోండి. అప్పుడు మీరు వేయబోయే అడుగు అతనికి ఏమైనా ప్రయోజనం ఉందా?
అతని జీవితము జీవిత ధ్యేయం సఫలీకృతం అవుతుందా?
ఆకలిగా ఉన్న వానికి గాని నైరాశ్యం వల్లగాని కుంగిపోతున్న వానికి గాని ఉపశమనం ఏమైనా కలుగుతుందా అని ప్రశ్నించుకోండి?
వీటికి సరైన నా సమాధానం లభించినప్పుడు మీ ఊగిసలాట సందిగ్ధావస్థ మబ్బుల్లో తొలగిపోయి మనసు కుదుటపడి మీకు ప్రశాంతి లభిస్తుంది.
కామెంట్‌లు