సహనశీలి;(కలం స్నేహం-)అరుణ భట్టువార్
ఎంతటి  ధన్య జీవివమ్మ
పునీతమైన పుణ్యచరిత నీవమ్మా

పురిటి నొప్పుల నెన్నో భరిస్తూ
 మానవాళికి జన్మనిస్తూ
కన్న తల్లిగా మా కలలు నీవు పండిస్తే...
నీకుమా మానవాళి చేస్తున్న మేలేది??
పాప! మనక ఇంధనాల రూపేన 
గనుల ,తవ్వకాలు అంటూ నీ గర్భమందు గోతులు తవ్వి.
రక్తాన్ని చీలుస్తూ....
రంధ్రాలు ఎన్నో చేస్తూ.
నీ ..కన్నీటిని  నీవు దిగమింగి.
మంచి నీటిని మాకిచ్చే.
మానవతా మూర్తి నీవమ్మా.

అరక చేతబూని నాగలితో నీ నవనాడుల్ని చీల్చితే.
మరి నువ్వేమో!! పచ్చని పైరు లకు ప్రాణం పోసి .
పంట పొలాలుగా మార్చి దాన్య గింజలు మా కిచ్చే ధరణి  మాత! నీవు ధన్యజీవివమ్మ.

మంచి  నీరు  మాకంటూ. మానవత్వం 
మరచి గొట్టపు బావుల రూపేనా గొంతువరకు గోతులు తవ్వినా....
గుండెల్లో గునపాలు గుచ్చిన
స్వచ్ఛ మనసుతో సహజ జలాన్ని 
మాకిచ్చి సల్ల గుండు మని చక్కగా దీవించే చల్లని తల్లి నీవమ్మా!!

అండగా ఉండే ఆప్తు రాలివి.
 కష్టాలు తీర్చే కన్నతల్లిని.
నీ శరీరాన్ని చిద్ర ఛిద్రం చేసినా!
చిత్ర వదలను నీ వోర్చి
మా మంచినే గోరిన మానవతామూర్తి నీవమ్మా
ఏమిస్తే నీ రుణం తీరుతుందో మరి? తల్లి నీది.
 ప్రణమిల్లి ప్రార్థిస్తాను.
సెల విస్తావా!! మరి ?


కామెంట్‌లు