సంసారము మహా సాగరము;---గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
అతిపెద్ద సాగరము
అవనిలో సంసారము
దాటగల్గిన విజయము
కుటుంబాలు సుఖమయము

తెలుసు కదా చదరంగము
మహిలోన సంసారము
పర్వతంలా  భారము
చేరాలోయ్ తీరము


ఎందరో ఈదారు
స్ఫూర్తినే ఇచ్చారు
మెళుకువలు నేర్పారు
ఆదర్శం చూపారు

చేయాలి సంసారము
కావాలి సాకారము
చూపాలి ఆదర్శము
పొందాలి ఆనందము

కామెంట్‌లు