సత్పురుషులచే నిండైనది
వైభవ ప్రభావ ఒప్పారు
జగతు కళ్యాణ నిమిత్తమది 7881
సనక సనంద నాదులును
సంతోషపు స్వాంతనులును
యోగశక్తితో వేగముగా
చేరిరి వైకుంఠంబును
7882
మరకత రత్న తోరణ సమంచిత
కుడ్య కవాట దేహళీ విరచిత
ఏడవ ద్వారంబున ఇద్దరును
ద్వారపాలకులనే జూచిరంత 7883
హార కేయూర ధరుల కమనీయ
కాంచన నవరత్నపు కాంగుళీయ
సౌర భాగవత మత్త మధుకర
కలిత సద్వన మాలిక విరాజయ 7884
గదా యుతులు ఘన చతుర్బాహుల
ఉన్నతోత్సాహంబు గల మతుల
నా రూఢ రోషాణలారుణి తాక్షు
భ్రూలత కౌటిల్య ఫాలతలుల 7885
చేతులలో బెత్తాలు ధరించి
ఏకాంత మందిర ముందు నిలిచి
కాపలా గాయుచు నుండిరి
జయ విజయులు బాధ్యత గుర్తించి 7886
విష్ణుదర్శన కూతుహలంతో
లోపలికి వెళ్ళుట తలంపుతో
సనక సనందనాదులు పోవగ
అడ్డుకొనిరి తమదు భాద్యతతో 7887
బృందారకులు చూస్తుండగ
వారందరును వింటుండగ
సనకాదులు యిలా యనిరి
దారుణంబైన కోపంగ 7888.
*జయవిజయులకు సనకాదులు శాపమిచ్చుట*
కావున........
పరమ అనంతుడు పరిపాలుని
సుహృత్తమునిస్టు సర్వేశ్వుని
మదాత్ములై కొలువ దర్శింపను
మా కడ్డుపడిరి దురాత్ములని 7889
కొందరిని ప్రవేశింప చేయుట
మరి కొంతమందిని వారించుట
దౌవారిక స్వభావముతో
తగదు మీకును శంకం జేయుట 7890
..............
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి