బోన్సాయ్ మొక్క-బాల గేయం :- ఎం. వి. ఉమాదేవి

చిన్నారి వృక్షాలు 
వింతైన విషయాలు 
తీగలతో బంధించి 
తీర్చేటి చిత్రాలు !

జపనీయ కళగాను 
జనము నాకర్షించు 
కుండీలలో ఇమిడి 
కాపునూ అందించు!

పద్ధతిగా పెంచాలి 
పదిమంది మెచ్చాలి 
ప్రదర్శనల లోను 
బహుమతిని పొందాలి!

కామెంట్‌లు