మాటరాని మౌనమే ;---పురం మంగ-కలంస్నేహం
నిను నేను కోరి చేరానో
కోరుకుని నీవు నను
సృష్టించావో
ఏదేమైనా
నీతో నేను,నాతోనే  నువ్వు

లీలామనోహరుడైన
రాధా విధేయుడైన
వేణుమాధవుడైన
వల్లభుడు
రాధ కన్నులలో కనులు నిలిపి
శిల్పభంగిన తన్మయత్వంతో
మది భావనల  ఊసులాడుతూ
ప్రకృతి ని మర్చి మూర్తులైరి

క్షణక్షణం నిన్నే పిలుస్తూ
ప్రతిక్షణం నీకై తపిస్తూ
అనుక్షణం నీకోసం జీవిస్తూ
నాదైన జీవితంలో
నీదైన ఊహల లోకంలో
విహరించు నీరాధను
నీలో నింపుకుని ఇహపరములలో
నీతోనే ఉండే అదృష్ట వరమీయుము ప్రియా,....

నను నేను మైమరిచి
నీ జ్ఞాపకాల నీడలలో
నీకై పరితపిస్తున్న వేళలో
హఠాత్తుగా నీవు ప్రత్యక్షమైతే మాటరాని మౌనమైనా

చూడాలని ఆరాటం
పిలిచేందుకు మోమాటం
కలవాలనే పోరాటం
కలిసేందుకు తటపటం
వెంటుండాలనే బులపాటం
కాదనలేని ఎడబాటు
అయినా
నా మది కోరుతోంది
అనునిత్యం నీ సాన్నిధ్యం........


కామెంట్‌లు