శ్రీ గాయత్రీ దేవి స్తుతి:-- మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 శరన్నవరాత్రుల సందర్భంగా
సీసమాలిక పద్యం
గాయత్రి మంత్రము ఘనమైన మంత్రము 
పటియించినను చాలు పాప హరము ,
సర్వవ్యాపక దేవి శక్తి స్వరూపిణి
బుద్ధి ప్రదాయిని పూర్ణదేవి,
పాంచభౌతిక మాత పరమ పావని తల్లి
మమ్మేలు మాయమ్మ మదిన గొలుతు ,
ముక్తా విద్రుమ హేమ ముక్తి ప్రదాయిని
నీల ,ధవళ వర్ణ నిన్ను వేడి ,
నిత్యంబు ధ్యానించి నీ నామమును  మేము
వీడక గొలిచేము  వేద
జనని ,
సకల శుభములను సమకూర్చు గాయత్రి
పొగిడినా చాలును పొంగి పోవు,
పంచముఖి జనని  పద్మాస
నమునందు 
దర్శనమిచ్చును తల్లి మనకు ,
హంస వాహన మెక్కి యరుదెంచి బ్రోచెడి
జగదాంబ నీవెగా జయములిచ్చి .
తేటగీతి
వేద మాతయే గాయత్రి వేదవేద్వి ,
ఆది మంత్రము జపియించ హాయి గూర్చి,
అన్నమొసగెడి తల్లివి యవనినకంత ,
యెల్ల లోకాలనేలేడి యిలన వేల్పు.

కామెంట్‌లు