స్వేచ్ఛకై అడగు పెట్టి
జాతికై నడుం కట్టి
సత్యాగ్రహం చేపట్టి
బాపు జైలులో బందీ
స్వాతంత్ర్యం కై సంధి
దేశ శాంతికి నాంది
పలకిన మాట హిందీ
సహాయ నిరాకరణ
అస్పృశ్యత నివారణ
సమత మమత ఆచరణ
భారతావని అర్పణ
తుపాకీ పట్ట లేదు
కాలూదువ్వ లేదు
అసత్యం పలక లేదు
కులమత భేదం లేదు
సత్యం కోసం శోధన
శాంతి కోసం బోధన
సహాయ నిరాకరణ
స్వదేశి వస్త్ర ధారణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి