* సు (నంద) భాషితం;- *సునంద వురిమళ్ల, ఖమ్మం**

 *అహింస పరమో ధర్మః*
******************
*అహింస ధర్మాలలో ఉత్తమోత్తమమైనది.*
*అహింస అనే పదం చాలా గొప్పదైన పదం.ఎంతో విస్తృత అర్థం కలది*.
 *హింస చేయక పోవడమే అహింస అని ఒక్క మాటలో చెప్పవచ్చు.*
 *హింస అంటే కేవలం ఇతరులను బాధించడం, వేధించడం*
*సంహరించడమే కాదు.*
*పరుల మనసును గాయపర్చడం,వంచించడం, ప్రకృతిని, పర్యావరణాన్ని  నాశనం చేయడం లాంటివెన్నో హింస కిందికే వస్తాయి.*
*అలాంటి హింసాత్మక చర్యలు చేయకుండా ధర్మ మార్గంలో నడవడమే అహింస.*
*సమాజం సుఖశాంతులతో వర్థిల్లాలంటే ప్రజలు అహింసా మార్గంలో నడవాలి.*
*సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*

కామెంట్‌లు