సు (నంద) భాషితం; అలవాట్లు;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 సరదాగా మొదలు పెట్టిన అలవాట్లు చాపకింద నీరులా మన ఒంట్లోకి,ఆ తర్వాత ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
మంచి అలవాట్లయితే సంతోషంగా స్వాగతించాలి. అవి మన ఉనికిని ఉన్నతంగా చూపుతాయి.
చెడు అలవాట్లయితే వెంటనే వదిలించు కోవాలి.   లేకపోతే అవి మనపై స్వారీ చేసి మన మంచి గుణాలను సర్వస్వం కొల్లగొట్టి అధఃపాళంలోకి నెడతాయి.
మంచి అలవాట్లను ఎంచుకుని ఆచరించడం లోనే మన విజ్ఞత బయటపడుతుంది.
ప్రముఖుల జీవితాలను పఠిస్తుంటే తెలుస్తాయి.
మనకూ సమాజానికి హితమైన మంచి అలవాట్లేవో
ఉషోదయ నమస్సులతో

కామెంట్‌లు