*అమ్మ ప్రేమ* *(మణిపూసలు)*;- మిట్టపల్లి పరశురాములు
అమ్మ మనసు కమ్మదనము!
నాన్న మాట వెచ్చదనము!
అమ్మ జోల పాడగా!!
జీవనమే పచ్చదనము!!

పల్లె మనకు తల్లిరా!
ఊయలూపె మాతరా!
మమతల పొదరింటిలోన!
కాపు జేసి పెంచురా!!

అమ్మ మనకు అండగున్న!
బతుకంత పండుగన్న!
ఆమె ప్రేమ లేక పోతె!
జీవితమే దండగన్న!!
            ***

కామెంట్‌లు