దక్ష ప్రజాపతి కూతురు దితియు
మనసున పొడమె సంతాన రుచియు
విరహతాప సమాగ వాంఛతో
పతి కశ్యపున్ని సమీపించియు 7816
ఇట్లనెను
గజ యేనుగు అరటి తోటలను
విదిలించినట్లు మదనుండును
మనసును అల్లకల్లోలం జేసె
కావుము ప్రభుత్వ మెలర్పగను 7817
అదియును గాక నా సవతులెల్లను
భవత్కృపన గర్భంబులు వడసెను
నిర్భరానందములో నుండ జూసి
శోక వ్యాకులిత చిత్తము తోడను 7818
మీరు మహా ధర్మ పండితులు
లేవు మీరెఱుగని విషయాలు
దుఃఖితులైన వారి కోరికలను
తీర్చుట ధర్మము సత్పురుషులు 7819
పతి సమ్మానంబును వడసిన
అభిమత సంసిద్ధియు పొందిన
ఉర్జిత యశము గలిగి లోక
స్తుతమై జువ్వెలు చెలువారిన 7820
............
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి