ఏమికాలము దాపురించెనురా!
కలియుగమునందున
మాయరోగ-మొచ్చిచేరెనురా
మనబ్రతుకునందన "ఏమి"
బంధుబలగము-బాధనొందెనురా!
బంధములనుతెంచి
సంధుసంధున...
తిరుగుచుండెనురా!! ""ఏమి"
తల్లిపిల్లలు- తల్లడిల్లెనురా!
మానవ మనుగడందున
కాని కాలమొకటివచ్చెనురా!
ఈనాటి కాలమున "ఏమి"
కలిసిమెలిసిన-కలిమిపెరెగెనురా!ఆనాటికాలమున..
మేటిగుండెనురా!!
దూరభారమె -దుఃఖమాయెనురా!ఈనాటికాలమున
పాడురోగము-పడకవేసెనురా!
పరేషానుచేయగా!! "ఏమి"
ఇంటిలోనె-ఇంపుగుండుమురా!
ఈకాలమందున
కడపదాటిన-కాటువేయునురా!
కఠినంపుపురుగు. "ఏమి"
గుంపులందు-కూడబోకుమురా!!
ఈజగతియందున
తరిమితరిమి-తన్నివేయుమురా!
ఈపాడుపురుగును
పాతరపెట్టెయ్యిసోదరా!! "ఏమి"
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి