కొల్లాయిగట్టితేనేమి ?
బోసినవ్వుల గాంధీ -
పదవులకు దూరమైతేనేమి ?
సత్యాగ్రహమనెడు -
ఆయుధముపట్టి ...
సకలభారత జనులను ,
ఏకత్రాటిపైకి తెచ్చి ..
స్వాతంత్ర్యము తెచ్చేగా !
అహింసామార్గము
బోధించి ....
హింసకుగురిఅయ్యేగా
మహత్ముడు ...
అశువులు బాసేగా ...!!
-------------------------------------
పొట్టివాడైతేనేమి
మా శాస్త్రీజీ
బహుగట్టివాడులే !
రాజకీయాలలో
లాల్ బహుదూర్
ముద్ర ....
ఆదిప్రత్యేకములే !
బాధ్యతగల మంత్రి
సైనికుడిని .....
రైతన్ననూ.....
ప్రస్తుతించిన
ప్రధానమంత్రి .....!
తాష్కెంటు ....
ఒప్పందసీమయే
ఆయన
మృత్యుభూమిగమారె
ప్రజలజ్ఞాపకాలలో
ఆయన మరీ....
పొట్టివాడుగామిగిలిపోయె!
-------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి