పండ్లూ-పండ్ల రసాలు
పసందైనపానీయాలూ
అందరికీ ఆమోదమే
ఆరోగ్యానికి అవసరమే !
ఎదుగుతున్న పిల్లల కు
ఎముకల పుష్టికి
స్పష్టమైన నేత్రదృష్టికి
అవసరమనిచెబుతారు
మాడాక్టర్ తాతయ్య....
అందుకేనేమోలే....
అమ్మ ఎప్పుడూ తెస్తుంది
రకరకాలతాజా పండ్లు..!
నేనెప్పుడూ సిద్దమేలే...
వాటికోసం.....
పండ్లైనా-పండ్ల రసాలైనా
నాకు చెప్పలేనంత ఇష్టం!
ఇంతకు మిన్చి...
వాటిగురిన్చి...
చెప్పడం బహు కష్టం....!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి