పిట్ట కథ -బాల గేయం ;-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు

పద పదవే పిట్టా 
ఎద ఎదనే తట్టా 
నా మదినే ఇట్టా 
నీకిచ్చా నట్టా!!

మనం చెట్టా పట్టా 
జనం రాసే చిట్టా 
కులం మతం రెట్టా 
కూడు గూడు పెట్టా!

రంగు వేరు పిట్టా 
మంచి మనసు గట్టా 
బువ్వ తెచ్చి పెట్టా 
వానకి గొడుగు పట్టా!

కుకూ కుకూ పిట్టా 
నీకై కూత పెట్టా 
జాతి బేధం ఎట్టా 
కలిసి పోదామిట్టా!!

కామెంట్‌లు