ఎవరు గొప్ప! --నందగిరి రామశేషు-కలం స్నేహం
 పుట్టిన నుండీ పోయేదాకా కొందరికి కులం, కులమని ఒకే జపం
ఏది పెద్ద కులం, ఎవరిది చిన్న కులం
పూజిస్తామా దేవుని, కులాన్ని తెలుసుకుని
రక్తాన్ని చూసి చెప్పగలమా, ఏ కులపు రక్తమని
నీవు తినే ఆహారానిది, తాగే నీటిది, పాలది ఏ కులము?
మందిచ్చే వైద్యునిది, పాఠం చెప్పే గురువుది
తెలుసుకున్నావా కులమేదో, జీతమిచ్చే సంస్థది
బిడ్డలు ప్రేమిస్తే, పెళ్ళిచేయడానికి కావాలి కులము
పనికిమాలిన వాడైనా, గొప్పోడే, కులం నీదైతే 
కులం పేరుతో గొంతు కోసి, రచ్చకెక్కితే పోదా పరువు?
దైవం పెట్టలేదు ఎన్నడూ కులాల జాబితా, 
నాడు పుట్టుకతో కాక వృత్తిని బట్టే కులం
నేడు వృత్తిని బట్టి కాదు కులం, ప్రవృత్తిని బట్టి
ఎవరి కులం గొప్ప, వారిదే, ఇతర కులాలు కంటికి ఆనవే.
కులం పేరుతో చేసుకుంటే బిడ్డలని దూరం
కూడు పెట్టేనా నీకు, నీ కులం!
ఆదుకొనేది అవసరాలకు నీ బిడ్డలు, కాదు కులపెద్దలు.
కళ్ళుతెరచి ఇప్పటికైనా, దింపుకో కులపు మూట
పట్టించుకొనేవారుండరు ఎవరూ నీ మాట
సమాజమన్నది మనమేర్పరుచుకున్నది
నియమాలు సైతం మనమేర్పరిచినవి
కాలానుగుణంగా మార్చాలి ఆ నియమాలు
మనమూ మనని కాలంతో పాటు మార్చుకోవాలి
లేకుంటే కాలమాగదు ఎవరి కోసమూ
ముందుకెళ్తుంటే  ప్రపంచం, మనమే వెనక పడతాము

కామెంట్‌లు
అల్లాడి వేణుగోపాల్ చెప్పారు…
కులపు మూట
కుళ్ళిన ఊట

అల్లాడి వేణుగోపాల్