వృద్ధులు: -డాక్టర్ . బెజ్జంకి

చీకేసిన తాటి పండు
కాలిపోయిన కొవ్వొత్తి
చదివేసిన న్యూస్ పేపరు
వాడేసిన ప్లాస్టిక్ డబ్బా

చిరిగిన చొక్కా
అరిగిన చెప్పులు
ఊడిన జుట్టు
వాడిన బొట్టు

ఉడిగిన ఆకు
వాడినపూలు
విరిగిన కొమ్మ
మురిగిన పండు

ఈనాటి వృద్ధులు
ఇంటనున్న
వ్యర్ధ పదార్థాలు
కన్నసంతు ప్రేమలు
కరువై కుములువారు.

దగ్గలేదు మింగలేరు
దర్జాగా బ్రతక లేరు
ధనమున్న లేకున్నా
కోడలేసే కబళంకై
కరువుపట్టి ఉన్నవారు.
ఈనాటి వృద్ధులు
వ్యర్ధంగా బ్రతికే వారు
కొందరైతే
వృద్ధాశ్రమాలలో 
బ్రతుకునీడ్చేవారు 
కొందరు.
ఆస్తులున్నా అధోగతే
కామెంట్‌లు
Shyam kumar chagal చెప్పారు…
నిజం. దురదృష్టం మన దేశంలో