అక్షర మాల -బాల గేయం (హ గుణింతం );-ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
 హరిత వనాలు పెంచాలి 
హాయిగా ఆడుకోవాలి 
హితవు చెప్పినను వినాలి 
హీన గుణాలు వదలాలి 
హుషారుగా మనముండాలి 
హూoకరించుట మానాలి 
హృదయం స్నేహం నిండాలి 
హొయలు నెమలిగ ఆడాలి 
హోళీ పండుగ చేయాలి 
హౌరా ఎక్స్ ప్రెస్ ఎక్కాలి 
హంపీ ఎల్లోరా చూడాలి!!

కామెంట్‌లు