మహాత్మా ! ఓ మహాత్మా!!:-- యామిజాల జగదీశ్

మహాత్మా!
మహత్తును పొదిగిన 
ఆత్మ - మీరు!

దేశానికి
స్వాతంత్ర్యం 
సాధించి పెట్టాలన్న
ఏకైక లక్ష్యంతో
యావత్ జాతినీ
ఏకతాటిపై నడిపించి
అహింసాయుత
పోరు నడిపించిన
మహాత్ములు మీరు!

ఉప్పు సత్యాగ్రహమూ
నిరాహార దీక్ష సాగించిన 
ఉత్తమ నేతగా
ఆదర్శప్రాయులు మీరు!

ఆయుధమెత్తిన 
ఆంగ్లేయులను 
ఎదుర్కొని
ఉద్యమించిన 
ఉత్తమ మార్గదర్శి మీరు!

పుత్లీబాయికి జన్మించిన 
బుద్ధిమంతులు మీరు!

జాతికోసం
జీవితాన్ని అంకితంచేసిన
సాటి లేని మేటి ఉద్యమనేత మీరు!

కొల్లాయి కట్టి దేశమంతా
పర్యటించి
ప్రతి ఒక్కరికీ
పూర్తి వస్త్రముండాలని
ఆశించిన మహానేత మీరు!

నిర్దేశించుకున్న లక్ష్యాలకు
అనుగుణంగా 
జీవితాంతం నడచిన
త్యాగధనులు మీరు!

జాతిపితా!
మీవల్లే భారత దేశం
పొందింది స్వతంత్ర శాంతి!!

మీకిదే మా నివాళి!
హృదయపూర్వక పుష్పాంజలి!

కామెంట్‌లు