పెద్దకడబూర్ మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త , బాలబంధు,గణితోపాధ్యాయుడు గద్వాల సోమన్నను " పాలపిట్ట జాతీయ " పురస్కారం వరించింది.
తెలుగు సాహిత్యములో శ్రీమతి నెల్లుట్ల సునీత గారు రూపొందించిన 'సున్నితం' నూతన కవితా ప్రక్రియలో 'సున్నితాలు' లిఖించినందులకు,తెలుగు సాహిత్యంలో వీరి విశేష కృషికి గానూ "విజయ దశమి మహోత్సవ వేడుకలు పురస్కరించుకుని సాహితీ బృందావన జాతీయ వేదిక సంస్థ వారిచే " పాలపిట్ట జాతీయ" పురస్కారం-2021" గద్వాల సోమన్నకు వాట్సప్ వేదికగా ప్రదానం చేయడమైనది.పురస్కార గ్రహీత గద్వాల సోమన్నను సంస్థ సలహాదారు,మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి,కార్యదర్శి వాకిటి రాంరెడ్డి, అధ్యక్షురాలు సునీత గారులు,ప్రధానోపాధ్యాయులు,తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరూ అభినందించారు.
"పాలపిట్ట జాతీయ" పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి