చిన్ననాటి చెలిమితో
మమతల బంధాలతో
పెనవేసుకున్న అనుబంధం
బంధుత్వాన్ని మించిన స్నేహం
ఇద్దరం ఒద్దికగా కలిసున్న కాలం
ఒక్కలా పుట్తి పెరిగి
ఒక్కలా ఆలోచించి
ఒక్కటిగా జీవించి
ఒకరికి ఒకరమై నిలిచాం
కన్నుకుట్టేలా ఎందరికో,
చాప కింద నీరులా
దూరాలు పెరిగాయి
బంధాలు భారమైనాయి,
కరిగి పోయిన కాలమే సాక్ష్యం
లెక్కలేనన్ని సార్లు గుండెలో
గుబులు పుట్టి జ్ఞాపకాల
తలంపుల్లో తడిసిన ప్రతిసారీ
హెచ్చరిస్తునే వుంది నా మనసు-
తన మనసెందుకో ఎడారైంది
నాదనుకున్న ఆ మనసు
ఎక్కడో మరే కొత్త బంధాల
తాకిడిలోనో రాలేకుందేమో
రాకూడదనుకుందేమో
ఓనాడు నిత్యం నాకు
తానొక ఒయాసిస్సులా సేదతీర్చేది
వసంత రాగాలు ఆలపించేది
ప్రేమపాశంలో
తడిసి ముద్దయ్యేవాళ్ళం
నన్ను చూసినంతనే
మయూరిలా నాట్యమాడేది
ఇప్పుడు కన్నీటి తీరాలు
తరిలించినా కరిగిన దాఖలాలే లేవు
ప్రేమపూరిత రెండు కన్నీటి
చుక్కలైనా రాలలేదు
ఎందుకో మరి ఎడారైంది
తన మనసు
పలకరింపుల్లో అన్యమనస్కంగా
పెదాలపై ప్లాస్టిక్ నవ్వులు,
ఇప్పుడెందుకో ఎండమావైంది
ఎడారైన మనసుతో
అభినందనలు...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి