*మిట్టపల్లి నానీలు*;- మిట్టపల్లి పరశురాములు
కాలాన్నివృధా
చేయడమంటే
నిన్నునీవే దోపిడి
చేసుకోవడమే!!

బంధాలుతెంచె
శక్తి కోపానికుంటే
కలిపేశక్తి
చిరునవ్వుకుంటుంది

ఆస్తులెక్కువున్న
వారికంటే
ఆప్తులెక్కువున్న
వారె అధికసంపన్నులు
            ****

కామెంట్‌లు