జీన్ మ్యాప్ సైన్స్ వ్యాసం;-ప్రతాప్ కౌటిళ్యా (కె ప్రతాప్ రెడ్డి)
 హ్యూమన్ జీనోమ్ లో మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనిషి పై దాడి చేసిన అన్ని రకాల బ్యాక్టీరియాలు వైరస్ లు రసాయనాలు ఆయా సందర్భాలలో కలిగించిన రుగ్మతలు దానిని, దానినీ వ్యతిరేకించిన ఇమ్యూనిటీ జీన్స్ జీనోమ్ లో రికార్డ్ అయి ఉంటుంది. కాకపోతే దానికి గురైన మనుషుల తరాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఆ తరం human genome లో వైరస్లు బ్యాక్టీరియాలను అధిగమించిన సమాచారం కనుక మనం తెలుసుకుని దాన్ని జీనోమ్ థెరపీ లా కానీ లేదా దాని సమాచారాన్ని రసాయన రూపంలోకి మార్చి మనిషి జీవన క్రియ లోకి అనువదించి కారణం ఆ సమాచార సామర్థ్యాన్ని కనుక కలుగ చేస్తే తిరిగి ఆ రుగ్మత జీవిత కాలం మొత్తం కాక పూర్తి human genome లోనే రికార్డ్ చేసి నట్లైతే తరువాతి తరాలకు ఆ వ్యాధి సంక్రమించే అవకాశమే లేదు.
కాకపోతే వైరస్లు బ్యాక్టీరియాలు కీటకాలు మాత్రమే ఇంతవరకు జీవుల్లో వాటీ జీనోమ్ లో వాటి దాడి వాటి రుగ్మతల సమాచారం రికార్డు చేయబడింది. అందుకే మొక్కల్లో కూడా వైరస్లు బ్యాక్టీరియాలు కీటకాలు వాటి దాడి వలన కలిగిన రుగ్మతలు వాటిని అధిగమించి జెనిటికల్గా వాటి దాడి వలన ఎలాంటి అపాయం లేకుండా పెరిగిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. అంటే వాటి వాటి జీవుల జీనోమ్ లో రికార్డు కాబడిన సమాచారం మనకు తెలియాల్సి ఉంది.
ఆ తర్వాతే శాస్త్రీయ సమాచారం కోసం మనం మొక్కలు జీవుల పై పరిశోధనలు చేసి వాటి జీనోమ్ స్లో వైరస్లను బ్యాక్టీరియాలను కీటకాలను వ్యతిరేకించిన జీన్స్ సమాచారాన్ని కనుక మనం రాబట్టగలిగితే, ఆ సమాచారంతో ఆ వైరస్లను బ్యాక్టీరియాలను కీటకాలను వాటి రుగ్మతలను మనం పుట్టుకతోనే అధిగమించిన వారమవుతాం.
ఖచ్చితంగా ఒక మొక్కను ఒక జీవిని తీసుకొని వాటి genome రూపాన్ని గనుక అధ్యయనం చేయగలిగితే, అదే సమాచారాన్ని అన్నిటికి వర్తింప చేయవచ్చును. లేదా ఆ రుగ్మతల జీన్స్ సమాచారాన్ని వాటి జీనోమ్ లో ఎక్కడ 
కోఇన్సైడ్ అవుతుందో గమనించి దాన్ని పసిగట్టగలము కూడా. సరిగ్గా అలాంటి జీన్ సమాచారము ద్వారా దాని స్పందనను మనం అధ్యయనం చేసి వైరస్ బ్యాక్టీరియా ల కీటకాల రుగ్మతల జీనోమ్ మ్యాప్ తయారు చేయవచ్చును. ఆ మ్యాప్ ద్వారా ఆయా రుగ్మతలకు కారణమైన వైరస్లు బ్యాక్టీరియాలు కీటకాలను మనం వాటిపై దాడి చేసినప్పుడు కలిగిన నష్టాన్ని మనం అధిగమించే అవకాశం ఉంది. కాకపోతే ఇది మాలిక్యులార్ బయాలజీ కి చెందినది కాబట్టి కాస్త కష్టమైనా ఫలితం మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. అప్పుడు వ్యాక్సిన్లు అవసరము ఉండదేమో మరి ఇప్పటి  కరో నాకు కూడా వ్యాక్సిన్ అవసరం ఉండదు .
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist
8309529273.
Dedicated to SaleemBai


కామెంట్‌లు