గాంధీజీ :-..వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్, సిద్దిపేట
 సీస మాలిక పద్యం:-
ఆంగ్లేయ పాలన యధమమైనదనియు 
      తరిమికొట్టెను తాను తపన జెంది 
పరిపాలనెదిరించె పరపీడ నిరసించె 
       పరులకొఱకు తాను పాటుబడియె 
హింస మార్గమొదిలి హితవులు జెప్పుచు 
        స్వాతంత్ర్యమునుదెచ్చె సత్యమూర్తి  
రాజ్యసిద్ధి కొరకు రణమును జేసియు 
       శాంతిపథమునెంచె శాంతిదూత 
భారతావనికంత భాగ్యమ్ము దెచ్చియు 
       మహిలోన వెలిగెను మహితమూర్తి 
సత్యఅహింసల సాధనే ధ్యేయము 
       విశ్వమంతట తాను వినుతికెక్కె 
ఉన్నత భావాలునుత్పన్న మవగానె 
       ఆచరించియుతాను నాద్యుడాయె 
సామాన్య జీవన సన్మార్గ వర్తన 
      సత్యపిపాసియు సమరనేత 
తేటగీతి 
సత్యమైనట్టి పద్ధతి సబబెయనియె 
దేశ భవితను గోరియు దిశనుమార్చె 
సత్య వాక్కుల నిలయందు చక్కదనము 
ఆత్మ శక్తితో నడిపించి యధిగమించె. 
...............


కామెంట్‌లు