ముచ్చటైన కళ్ళజోడు
ముక్కు మీద నాట్యమాడు
దాని మేలు తరచి చూడు
అవసరమే మనకు నేడు
పెద్ద వారికిలను తోడు
చూపు పెంచు కళ్ళజోడు
పలురంగుల కళ్ళజోడు
ఇష్టపడని వాడు లేడు
దూరదృష్టి, హ్రస్వదృష్టి
తరిమికొట్టు కళ్ళజోడు
కంటిచూపు కాస్త పెంచి
మంచి చేయు కళ్ళజోడు
తలనొప్పి తగ్గించును
ప్రమాదాలు తప్పించును
చల్లదనము కల్గించును
నేత్రాలకు సాయపడును
పరిరక్షణ నయనాలకు
తోడుండు జీవితాలకు
దృష్టిలోపము సరిచేయు
కడు మేలు అవసరాలకు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి