దాదాపు నలభై ఏళ్ళ క్రితం పల్లెను విడిచిపెట్టి చెన్నైకి చేరుకున్నప్పటికీ పుట్టిన ప్రదేశ మట్టివాసనను మరవని కవి. పల్లె భోజనమంటే ప్రియం. ఈయనంటే ఇతర భాషా కవులకూ గౌరవం.
ఆళవందాన్ సినిమా పాటలకు ఊటీలో జీవం పోసుకున్నప్పుడు వాటికి హిందీలో పాటలు రాయడానికి వచ్చిన జావెద్ అఖ్తర్ "మొదట వైరముత్తు పాటలు రాయనివ్వండి. ఆయన ఊహలను అద్దెకు తీసుకుంటాను. అప్పుడు నాకు పాటలు రాయడం సులువవుతుంది" అని చెప్పి వైరముత్తు పాటలు రాసే వరకూ ఆయన పేకాట ఆడుకుంటూ కాలక్షేపం చేసారట.
కావ్య కవి అని కీ.శే. ఎ.పి.జె. అబ్దుల్ కలాం వైరముత్తుని సంబోధించినా, కవిసామ్రాట్ అని మాజీ ప్రధాని వాజ్ పాయి అభివర్ణించినా "కవిపేరరసు" అని కళైంజ్ఞర్ కరుణానిధి అనే బిరుదుతో సత్కరించిన మాటే స్థిరపడింది.
ఆయన రచనలలో కల్లికాట్టు ఇతిహాసం ప్రత్యేకమైన సాహితీ రచన. ఈ కావ్య ప్రతులు అయిదింటిని వాటర్ ప్రూఫ్ చేసి వైగై నదీ జలాలపై విడిచిపెట్టారు. ఆ నదీజలాల సాక్షిగా ఈ కావ్యరచన మిగిలిపోవాలన్న ఆశతోనే ఆయన ఈ విధంగా నీటికి సమర్పించారట.
ఈయనకు వైద్యరంగంలో అనేకమంది మిత్రులున్నారు. ధనికులు, పేదలు అనే తేడా లేకుండా ఎవరికి వైద్య సహాయః కావలసివచ్చినా ఆయన డాక్టరుకి ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకుని చికిత్సకు ఏర్పాటు చేయిస్తుంటారు. బాధితులకు కావలసిన సాయం అందిస్తుంటారు.
ఆహారం, వైద్యం, విద్య - వీటికి చేయందించడమే సాయమవుతుంది. మిగతావన్నీ ఆడంబరాలన్నది ఆయన అభిప్రాయం.
భారీగా డబ్బులిస్తామని ముందుకొచ్చినా ప్రకటన చిత్రాలకు ససేమిరా అనే వైరముత్తు అటువంటి వాటికి తన స్వరాన్ని సైతం అందించకూడదని నిర్ణయిఉచుకున్నారు.
పి. సుశీల, చిత్రాల వీరాభిమాని. సుశీల పాడిన కొన్ని పాటలను చిత్రతో పాడించుకుని తనకంటూ ఓ సీడీ తయారు చేయించుకున్నారు. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందని అంటుంటారు వైరముత్తు.
పచ్చయప్పన్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఆయన రాసిన తొలి కవితా సంపుటి వైగరై మేఘంగళ్ పాఠకలోకానికి చేరింది. ఈ పుస్తకం ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే ఓ మహిళా కళాశాలలో పాఠ్యాంశమవడం విశేషం. ఈ పుస్తకం 29 ముద్రణలకు నోచుకుంది.
ఏ ఊళ్ళో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఉదయం ఏడు గంటలకు కళైంజ్ఞర్ కరుణానిధితో తప్పనిసరిగా ఫోన్లో మాట్లాడేవారు. ఈ ఫోన్ సంభభాషణ అలవాటు ఇరవై అయిదేళ్ళకుపైగానే సాగిందట.
ఓ పాటకు ఎనిమిది గంటల సమయం తీసుకున్న సందర్భముంది. అది కాదల్ ఓవియం అనే సినిమా కోసం రాసిన పాట - సంగీత జాది ముల్లై ....పల్లవి ఇట్టా సాగుతుంది.
అలాగే రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన బాషా సినిమాకోసం ఓ పాటను ఎనిమిది నిముషాలలో రాసిచ్చారీయన. ఆ పాట ఇదే ..."ఎట్టు ఎట్టా మనుష వాయ్ వై పిరిచ్చుక్కో..."
కవిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సౌతరించుకున్నప్పటికీ ఈయనకు కథలు చదవడమంటే మహా ఇష్టం. ఓ హెన్రీ, మొపాసా, ఆంటన్ చెకోవ్, మాక్సిం గోర్కీ, పుదుమైపిత్తన్, జయకాంతన్, జానకిరామన్, అళగిరిసామి, తంజై ప్రకాశ్ కథలతోపాటు ప్రపంచ సాహిత్యంలో ప్రముఖ కథలుగా ముద్దవేసుకున్న రచనలెన్నింటినో సేకరించి చదివారు.
ఏడు వేల పాటలు, ముప్పైకి పైగా పుస్తకాలు రాసిన వైరముత్తు మూడుసార్లు వివిధ ధేశాలలో పర్యటించి పొందిన అనుభవాలు....వీటితోనే తన జీవితపయనం ఇప్పటికింకా యవ్వనంగానే అన్పిస్తుందని చెప్తుంటారు.
తనకు కానుకగా ఇచ్చే బంగారు ఆభరణాలను ఆ క్షణంలో పొందడమే తప్ప వాటిని ధరించరు. బంధువులకో మిత్రులకో ఎవరికో ఒకరికి వాటిని ఇచ్చెస్తారు. అయితే అన్నామలై, బాషా, ముత్తు, అరుణాచలం సినిమాలకోసం రజనీకాంత్ తనకిచ్చిన బంగారు గొలుసులను పదిలంగా దాచుకున్నారు.
రాత్రి ఎంత ఆలస్యంగా నిద్రపోయినా తెల్లవారుజామున అయిదు గంటలకు మేల్కొని వాకింగుకి రెడీ అవుతారు. ఆయనతో ఏ ఒక్కరూ కలిసి నడవరు. కారణం ఆయనతో నడవాలనుకుంటే పరుగు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఆయన ఎంత వేగంగా నడుస్తారో ఆలోచించాలి.
ఆయన తన వస్త్రాలన్నింటినీ చెన్నైలో ఉతికి ఇస్త్రీ చేయించరు. తన సొంత ఊరుకి పంపించి అక్కడి నుంచే ఉతికి తెప్పించుకుంటారు. ఇరవై జతలు పోతాయి...ఇరవై జతలు తిరిగొస్తాయి...నీటికీ ఉతుకుకీ మధ్య సంబంధం ఉంది అని అంటుంటారు.
ఆయనకు అమ్మ చేతి వంటంటే మహా ఇష్టం.
ఈయన మాట్లాడుతుంటే చిన్న కొడుకు కపిలన. వింటూ ఉంటాడు. కానీ పెద్దకొడుకు కార్కీతో మాట్లాడిస్తూ వినడానికి ఇష్టపడతారు.
ఆస్పత్రి నుంచి, జైలు నుంచి తనకోసం వచ్చే ఉత్తరాలు వచ్చినప్పుడు వాటికి ప్రధాన్యమిచ్చి జాబు రాయడం ఈయన అలవాటు. ఆ తర్వాతే మిగిలిన లేఖలకు రిప్లయ్ ఇస్తారు.
నోరారా నవ్వుతారు. ఆ సమయంలో పక్కనుంటే ఓ రెండు దెబ్బలు వేసి నవ్వడం ఈయన అలవాటు. ఇది తెలిసిన వారు ఆయనకు ఓ రెండడుగులు దూరంగా కూర్చుంటారు.
జాతీయ స్థాయిలోనూ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచీ తన పాటలకు అవార్డులందుకున్న వైరముత్తు కవితలను అమెరికా లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఆయనతోనే చదివించి రికార్డు చేసి ప్రపంచ సాహిత్య సరసన వాషింగ్టన్ డి.సి.లో భద్రపరచింది.
గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు అక్కడి వృక్షాల కింద సేదదీరడం ఆయనకు మహా ఇష్టం. అక్కడి చెట్ల ఆకుల స్పర్శ మరీ మరీ ఆనందం. ఆ కొమ్మల ఆకులను తెగ ఆస్వాదిస్తారు. కొన్నిసార్లు ఆకులు విప్పారడాన్ని చూసిగానీ ఇవతలకు రారు.
తాను ఇతరులకు చేసిన సాయాన్ని గుర్తుంచుకోరు కానీ తనకు ఇతరులుళచేసిన సాయాన్ని మరచిపోరు. తన ఇంట రిసెప్షన్ గదిలో ఉన్న ఎ.సి. ఎ.ఆర్. రహ్మాన్ తనకు కొనిచ్చారని పలువురితో చెప్పుకున్నారు
ఈయన కవితలను చదివి కొన్నింటిని అనువదించాను. వాటిలో ఒకటి కొన్ని నెలల క్రితం "సాక్షి" ఆదివారం అనుబంధంలో అచ్చయింది. అలాగే ఈయన వివిధ సందర్భాలలో మాట్లాడిన మాటలను యు - ట్యూబ్ లో వినడం నాకు అలవాటు. ఇష్టమూ. సంగీత దర్శకుడు ఇళయరాజాతో అభిప్రాయభేదాలొచ్చినప్పుడు ఈయన ఓ ఉత్తరం రాశారు. అది కవితాత్మకంగా సాగిన లేఖ. దానినిసైతం అనువదించాను. చాలా బాగుంటుందది. ఇళయరాజాతో ఉన్న మైత్రిని అభివర్ణించిన తీరు నన్ను ఆకట్టుకుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి