దినచర్యలో వికసించి...
దిగులు చెందని సంధ్యలో ..
దిన దినం ఆరాధనలో...
దైవ చింతన మార్గంలో
దారంలో అల్లుకున్న ఐక్యత పూల గుండెలు....
దరి చేరిన కొమ్మ రెమ్మ గుర్తులు...
దూరంలో వీడని పరిమళాల విలువలు...
ధూళి అనే స్వార్థం వదిలే
నవ్వులు...
దూర దూర తలపులలో తడిసిన ఊపిరి ఊయలలు...
ధన్యతలో తరించే ఉత్సాహ రెక్కలు...
దాసోహం అనే మాట లేని శ్రమ సవ్వడి వర్ణాలు...
దాగుడు మూతలు అడే సిగలో రేయి బాలల ప్రేమలు...
దుప్పటి కప్పుకున్న నింగి చీకటి నిద్రలో...
దోసిలి వెన్నెలలో జ్ఞాపకాల కన్నులు...
దైర్యపు నీడలో పొంగే నిప్పు రవ్వలు...
దేహమంతా కుల మత కుంపటి ఎరుగని...
దేశభక్తి నిండిన తేనెల ఊటలు...
దీపం బ్రతుకులో వెలిగే చమురు నీటి ముత్యాలు ..
దీపిక కరదీపిక లో తరగని విద్య పూల తోటలు...
దురదృష్టం చేరని సుర పూజ వస్త్రం...
దివ్యత్వంతో మెరిసే పద్మహసన సుమాలు...
దిగులు చెందని సంధ్యలో ..
దిన దినం ఆరాధనలో...
దైవ చింతన మార్గంలో
దారంలో అల్లుకున్న ఐక్యత పూల గుండెలు....
దరి చేరిన కొమ్మ రెమ్మ గుర్తులు...
దూరంలో వీడని పరిమళాల విలువలు...
ధూళి అనే స్వార్థం వదిలే
నవ్వులు...
దూర దూర తలపులలో తడిసిన ఊపిరి ఊయలలు...
ధన్యతలో తరించే ఉత్సాహ రెక్కలు...
దాసోహం అనే మాట లేని శ్రమ సవ్వడి వర్ణాలు...
దాగుడు మూతలు అడే సిగలో రేయి బాలల ప్రేమలు...
దుప్పటి కప్పుకున్న నింగి చీకటి నిద్రలో...
దోసిలి వెన్నెలలో జ్ఞాపకాల కన్నులు...
దైర్యపు నీడలో పొంగే నిప్పు రవ్వలు...
దేహమంతా కుల మత కుంపటి ఎరుగని...
దేశభక్తి నిండిన తేనెల ఊటలు...
దీపం బ్రతుకులో వెలిగే చమురు నీటి ముత్యాలు ..
దీపిక కరదీపిక లో తరగని విద్య పూల తోటలు...
దురదృష్టం చేరని సుర పూజ వస్త్రం...
దివ్యత్వంతో మెరిసే పద్మహసన సుమాలు...
ధరణి చేరిన స్వర్గం
అల్లాడి వేణుగోపాల్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి