.నిమ్మకాయల చిన్నోడు;-డా:కందేపి ప్రసాద్ రావు

 డియర్ లిటిల్ చిల్డ్రన్! వెజిటబుల్ కార్వింగ్ లో భాగంగా ఈరోజు అల్లరి పిడుగును తయారు చేద్దామా! ఈ బుడుగు ఎలా ఉన్నాడు?తల దువ్వుకోకుండా అమ్మ మీద అలిగి కూర్చున్నట్లున్నాడు. కదూ! సరే ఈ బుడుగుకు ప్రాణం పొద్దమా!
రెండు వేర్వేరు సైజుల్లో ఉన్న రెండు నిమ్మకాయల్ని తీసుకొని ఒకదాని మీద మరొకటి పెట్టి గట్టిగా కదలకుండా టూత్ ఫిక్స్ తో గుచ్చాలి.ఇది ఒకటి శరీరం ,మరొకటి తల అన్నమాట.తల భాగంలో కళ్ళు ,ముక్కు నోరు పెట్టాలి.కళ్ళ కోసం పుచ్చకాయ విత్తనాలు,ముక్కు నోరులకు క్యారెట్ ముక్కలు వాడను.తల మీద జుట్టు కోసం మొక్కజొన్న పొత్తుల లోని పీచును వాడను.రెండు వంపు తిరిగినట్లుగా ఉన్న క్యారెట్ ముక్కల్ని కత్తిరించి శరీరానికి రెండువైపులా చేతుల వలే అమార్చాలి.తరువాత మరొక క్యారెట్ ను తీసుకొని నాలుగు భాగాలుగా కత్తిరించాలి.కానీ ఒక చివర కలిసే ఉండాలి.ఇటువంటి క్యారెట్ లో సగభాగం తీసుకొని కొంచెం సేపు పక్కన ఉంచాలి.అప్పుడు క్యారెట్ రెండువైపులకు వంపు తిరుగుతుంది.దీనిని అప్పుడు కాళ్ళవలె అమార్చాలి.క్యారెట్ వంపు తిరిగితేనే కాళ్ళకు అందం వస్తుంది.ఇప్పుడు నిమ్మకాయల చిన్నోడు తయారై పోయాడు.సరే వీడిని ఏం చేద్దాం పిల్లలూ! పలక బలపం కొనిచ్చి బడికి పంపెద్దామా!
కామెంట్‌లు