గురువు; -మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జి
 పాట వెలదులు
1.
అక్షరంబు నతని యాయుధంబు,
పోరు సల్పు రోజు పుడమి నందు,
పాఠశాల కెళ్ళు పాటి గాను,
మేధనెరిగి జేయు బోధనెంతొ.
2.
భావిపౌరులందు భవిత నెంచి,
గురువు తీర్చిదిద్దు గోము గాను,
విద్యలందు మేటి విలువలెన్నొ,
నలవడింపజేయు హాయిగాను.
3.
పెంకి పిల్లలందు పేర్మి తోడ,
బుద్ధి మాటలెన్నొ బోధ జేయు,
సాధ్యమైనంతవరకు చక్క జేయ ,
శ్రద్ధ బెట్టి నేర్పు శ్రామికుండు .
4.
చదువు సంధ్యలందు శ్రద్ధ జూపు,
బాలలందరినిల  బాగు జూసి,
పుత్ర ప్రేమ జూపి ప్రోత్సహించు,
విద్య నభ్యసించ విర్రవీగు .
5.
గురువు కంటే నెదుగ గొప్ప గాను,
తాను జూసి మరియు తనివిదీర,
సంతసంబు జెప్ప సాధ్యమవదు,
ననుభవించగ నది హాయి గొల్పు.

కామెంట్‌లు