అందరికీ కావాలి వెలుగు;- - యడ్ల శ్రీనివాసరావుMTel, MSWకె ఎల్ పురంవిజయనగరం జిల్లా

 తిమిరంతో సమరం అజ్ఞానం లో వెలుగు
ఉదయాన్నే వెలుగు
రైతన్నకు నిరుపేదలకు
భూపతులకు నర పతులకు
జంతువులకు పక్షులకు
ఆ వెలుగు లేనిదే గందరగోళం
ఆడవారు నుదుటి తిలకం
రైతన్న చేతి ఎర్ర పంచి
కృషితో నాస్తి దుర్భిక్షం
అహర్నిశలు శ్రమించే శ్రమజీవి ఎర్రని సూర్యబింబం
వెలిగే నాధుడా నీకు వందనం

కామెంట్‌లు