సూక్తులు. సేకరణ- పెద్ది సాంబశివరావు, peddissrgnt@gmail.com, 94410 65414

 ఆశ
@ఆశ ఉన్నవాడు ఎంత ధనవంతుడైనా ఎల్లప్పుడూ దరిద్రుడే.  సౌందరనందం
@ఆశ గలమ్మ దోష మెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్య మెరుగదు.
@ఆశ దుఃఖానికి కారణం, దాని నుంచి మనం దూరమైతే దుఃఖం మన దరిచేరదు.
@ఆశ బోధిస్తున్నది ,  అవమానం బాధిస్తున్నది.
@ఆశలేని వానికి అడవైనా, ఇల్లయినా ఒక్కటే. బాలరామాయణం
@ఆశ సిగ్గెరుగదు, నిద్ర సుఖ మెరుగదు.
@ఆశ, ద్వేషం, కోపం విడనాడి దైవచింతన కల్గి వుండు. 
@ఆశావాదికి ఆపదలో కూడా ఆశ, నిరాశావాదికి గొప్ప అవకాశంలో కూడా ఆపద కనిపిస్తాయి. కాంప్‌బెల్
@ఆరోగ్యం బాగున్న వారికి ఆశ వుంటుంది.  ఆశ, ఆశయం వున్న వారికి అన్నీ వున్నట్టే. 
@కష్టాల్లో మగ్గుతున్న వాళ్లకు ఉపసమనం ఆశ ఒక్కటే. షేక్స్ పియర్
@కొండంత నిరాశ, గోరంత ఆశ.
@పెడతానంటే ఆశ,  కొడతానంటే భయం.
@ప్రాణం ఉన్నంత వరకు ఆశ ఉంటుంది, ఆశ ఉన్నంత వరకు పోరాటం తప్పదు.   ఎమర్సన్
@భయం, ఆశ, ప్రతిఫలాపేక్ష అనే మూడింటిలో ఏదీ లేకుండా ఎవరు సాయం చేయరు. 
@మనసు నిండా ఆశ నింపుకున్నప్పుడే చేయాలనుకున్న పని ప్రారంభించు . అగ్రిప్ప
@మరోజన్మ వుందనే ఆశ, విషాదసమయంలో ఒకే ఒక ఉపశమనం. మార్టిన్ లూధర్ కింగ్
@ముసలితనం అందాన్ని హరిస్తుంది. ఆశ ధైర్యాన్ని, మృత్యువు ప్రాణాలను, అసూయ ధర్మాచరణాన్ని, క్రోధం సంపదను, నీచుల సేవ @శీలాన్ని, కామం సిగ్గును, అభిమానం అన్నింటినీ హరించి వేస్తుంది. 
@యువత కోసమే నేను కలం పట్టాను.   వారి మీద నాకెంతో ఆశ ఉంది.   ఈ సమాజాన్ని మార్చగల దిట్టలు వాళ్ళే.  రాహుల్ సాంకృత్యాయన్
@వయసు పెరిగే కొద్దీ, అవయవాల పటుత్వం తగ్గిపోతుంది.  కాని ఆశ మాత్రం అధికమవుతుంది. నీతిసుధ
@ శ్వాస వుండే వరకూ ఆశ ఉంటుంది.

కామెంట్‌లు