కామంచి, బుడ్డగాసి (Solanum Nigrum )--ఔషధంగా...;-పి . కమలాకర్ రావు

 వర్షాకాలం రాగానే కామంచి చెట్లు
విపరీతంగా పెరుగుతాయి. దీనికి చాలా చిన్న చిన్న పళ్ళు ఎరుపు, నలుపు రంగుల్లో గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా ఉంటాయి. చిన్న పిల్లలు ఇష్టంగా
తింటారు. పులుపు, తీపి రుచుల్లో ఉంటాయి.
దీని ఆకులు, కాడలు, పళ్ళు అన్నీ
ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
ఇది క్రిమి సంహారిణి. పొట్టలోని
క్రిములను నాశనం చేస్తుంది.
అల్సర్ రానివ్వదు. ఇది కాలేయన్ని
శక్తీవంతంగా చేస్తుంది.
దీని ఆకులను కడిగి ముక్కలుగా త్రుంచి మరిగించి చల్లార్చి తేనె కలిపి తాగాలి. 
చర్మ వ్యాదులు రాకుండా కాపాడుతుంది. దీని ఆకులను,
కాడలను కొబ్బరనూనెలో వేసి
తైలంగా కాచి చల్లార్చి నిమ్మరసం పిండి దురదలపై రాస్తే తగ్గి పోతాయి.
కామెంట్‌లు