*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౨౪ - 024)
 కందం:
*వారిది వారిది ధనమొక* *కారణమున వచ్చిపడఁగఁ గన్నులుగన కె*
*వ్వారినిఁ దిరస్కరించును*
*గోరెఁడు ధర్మంబు లేక గువ్వలచెన్నా!*
తా.: 
ఇక్కడ ఈ నేల మీద వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వున్న డబ్బు అంతా ఏదో ఒక కారణంతో మన దగ్గరకు వచ్చేస్తే, అలా వచ్చిన నడమంత్రపు సిరితో వచ్చిన గొప్పను సాకుగా చేసుకుని ఎవ్వరైనా సరే కాలిగోటికి ఇచ్చే విలువ కూడా ఎదుటివారికి  ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*అసలు విషయం అంతా కష్టపడకుండా తేరగా వచ్చే సంపదలోనే వుంది.  ఇలా అసంకల్పితంగా వచ్చి చేరే సంపద వల్ల మనిషికి సోమరితనం బాగా అలవడుతుంది.  ఈ తేరగా వచ్చిన సంపద అన్ని అనర్ధాలకూ, మనశ్శాంతి లేకపోవడానికి కారణం అవుతోంది.  మనది కానిది ఏదైనా మనల్ని నాశనం చేస్తుంది. కష్టపడి సంపాదించినది ఒకపూట ఆకలి తీర్చడానికి మాత్రమే సరిపోయినా, చాలా తృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది.  కాబట్టి, మనిషై ఆలోచన కలిగిన వాడు, వేరొకరి సంపదకు అర్రులు చాచక తనకు వున్న దానితోనే సంతోషంగా జీవించడం అలవాటు చేసుకోవాలి.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు