*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౨౬ - 026)
 కందం:
*ధన మతిగఁ గల్గియున్నను* 
*దనయలుఁ దనయులును గల్గి తనరుచున్నన్*
*ఘనలోభియు నిరుపేదయు*
*గుణముల సరియగుదు రెన్న గువ్వలచెన్నా!*
తా.: 
ఈ భూమి మీద, కూతుళ్ళు, కొడుకులు వున్నావారు ఎవరైనా, చాలా ఎక్కువ, అవసరానికి మించి డబ్బులు వున్నవారు లోభిగా వుండి ఆ డబ్బు తమ పిల్లలకు ఏమీ వుపయోగించకుండా చేసే వారు, అలాగే కటిక బీదరికంలో వున్నవారు ఇద్దరికీ ఏమీ బేధము వుండదు ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*పరమాత్ముని చేత ఆలోచించే శక్తి ఇవ్వబడిన మనము, బీదరికంలో వున్నామా లేక ఎంతో గొప్ప సంపదలు కలిగివున్నామా అని కాక మనకు వచ్చిన మంచి ఆలోచనలను ఇతరులకు పనికి వచ్చేటట్టు గా ఎంతవరకూ ఆచరిస్తున్నాము అనేదే ప్రధానము. పరమేశ్వరుని దృష్టిలో, కులానికీ, కలిగివున్న సంపదకూ కాక గుణానికే ప్రాముఖ్యత.  అతి ముఖ్యమైన గుణాన్ని గాలికి వదిలేసి, గాలిలో కలసిపోయే ఐహిక సుఖాల వెంట మనము పరుగిడుతున్నాము.  వేంటాచలపతీ, మేము నిస్సహాయులము. నీ అండ లేనిదే మంచి చెడుల గుణ విభాజనము చేయలేము. చేయూతనిచ్చి మమ్మల్ని మంచి గుణముల వైపు పయనించేలా నీవే చేయాలి, ప్రహ్లాద వరదా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు