కందం:
*సంపద గలిగిన మనుజుని*
*కొంపకు బంధువులు కుప్పకుప్పలుగాఁగన్*
*సొంపుగ వత్తురు పేదకుఁ*
*గుంపటులన నుంద్రువారె గువ్వలచెన్నా!*
తా.:
డబ్బు ఎక్కువగా వున్న వాని ఇంటి చుట్టాలము అని చెప్పి ఎంత మంది వచ్చినా, చక్కగా కాలక్షేపం చేస్తూ ఎక్కవ కాలం పాటు వున్నా ఎవరికీ ఇబ్బంది కలుగదు. కానీ, అలా చుట్టలమని చెప్పి పేదవాని ఇంట్లో చాలా రోజులు వుంటే ఆ పేదవానికి గుండెల మీద భారంగానే వుంటుంది....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మనం ఐహిక సంపదల మీద దృష్టి పెట్టి, వాటి వెంట పరుగెడుతూ వుంటే మన చుట్టాలు, పక్కాలు మేము వున్నాము అంటూ విచ్చేస్తారు. ఒకసారి, ఆ ధనము ఆవిరి అయిపోయి మనము డబ్బు కోసం ఇబ్బంది పడుతుంటే, ఎవరికి వారు వారి దారి పడతారు. ఇది మానవ నైజం. అదే మనము మనసు పరాత్పరుని మీద లగ్నం చేసి, పద్మముల వంటి పరమేశ్వర పాదాలు పట్టుకుని, మోక్ష సంపద కోసం వెంపర్లాడితే, అక్షయలింగ విభుడు అన్ని విభవములను ఇస్తాడు. ఈ సంపదను తరింగించడం కానీ దొంగిలించడం కానీ ఎవరి వల్లా కాదు. ఈ పరమేశ్వర విభవములు తన వైన వాడు ఎవరైనా ఎన్నటికీ బీదవాడు కాలేడు. దారా, సుత, బంధు మిత్ర పీడ కూడా వుండదు. అంతా చిద్విలాసమే చిదంబరుని దయతో!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి