కందం:
*నీచునకు ధనము గల్గిన*
*వాచాలత గల్గి పరుషవాక్కు లరచుచున్*
*నీచ కృతి యగుచు మది సం*
*కోచము లేకుండఁదిరుగు గువ్వలచెన్నా!*
తా.:
బుద్ధి తక్కవ వున్న వారికి డబ్బులు రాసులు రాసులుగా వస్తే అహంకారం తలకు ఎక్కుతుంది. నోటికి వచ్చినట్లు, ఏమాత్రం ఆలోచించకుండా, ఎలాంటి మాటలైనా మాట్లాడుతారు. ఎవరైనా తమ గురించి ఏమైనా తప్పు గా అనుకుంటారేమో అనే అలోచన కూడా రాకుండా తిరుగుతూ వుంటారు....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మనం ప్రతీ రోజూ భగవత్ ప్రార్ధన చేసే టప్పుడు, ఆ రోజు గడవడానికి మనకు ఎంత గ్రాసం, ధనమూ అవసరమో, అంత మాత్రమే ఇవ్వమని ప్రార్ధించాలి అని, ఎన్నో మార్లు, ఎంతో మంది పెద్దలు, సమాజ హితం కోరుకునే వారు చెప్పారు. కానీ, మనం మాత్రము అనవసరమైన, విర్రవీగ డానికి వుపయోగపడే ధన సంపాదన వైపు ప్రయాణం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాము. అలా కాక, పరమాత్మ వైపుకు మన ప్రయాణం సాగిస్తే ఇహము పరము కూడా మనకు లభిస్తాయి.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి