*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౩౨ - 032)
 కందం:
*పిత్రాద్వైశ్వర్యముచేఁ* 
 *బుత్రులుఁ బౌత్రులున్ ధర్మబుద్ధిఁ జరింతుర్*
*చిత్రగతి నడుమఁగల్గిన*
*గోత్రంజిత్ర గతిఁదిరుగు గువ్వలచెన్నా!*
తా.: 
 తాత, తండ్రుల నుండి వంశానికి డబ్బు, సంపద వస్తే ఆ తండ్రి కొడుకు, మనుమలు ఎంతో చక్కగా మర్యాద గా ప్రవర్తిస్తారు.  అలాకాక, అనుకోకుండా, అకస్మాత్తుగా, ఆకస్మికంగా సంపద కనక వస్తే ఆ తండ్రి పిల్లలు చాలా వింత వింతగా, అనుకోకుండా వచ్చిన డబ్బు ప్రభావం ఎదుటి వాళ్ళకు కనిపించే టట్టుగా ప్రవర్తిస్తూ వుంటారు....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*అవును నడమంత్రపు సారి కలిగితే,  అలాటులేని నట్టువాంగం చేసినట్టు వుంటుంది. నిజమే.  అదే మనకు ఆకస్మికంగా భగవద్భక్తి అనే సంపద లభిస్తే, పరమాత్ముని దగ్గరగా వున్నాము అని తెలుసుకున్న ఆత్మ మనిషికి అణుకువగా వుండటం నేర్పుతుంది.  ఎప్పడు దొరికినా, భక్తి సంపద ఎంత ఎక్కువగా దొరికితే మనిషి, అంత మంచి నడవడికతో త్వరత్వరగా భగవంతుని పాదాలచెంతకు చేరుకో గలుగుతాడు.  మానవుడు నవ్యంగా ఆలోచిస్తూ భక్తి సంపద త్వరగా పెంచుకుని పరమాత్మ సన్నిధికి చేరుకునేలా భగవదనుగ్రహం వుండాలని, వుంటుంది అని ప్రార్థిస్తూ...*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు