కందం:
*గొల్లింటఁ గోమటింటను*
*దల్లియుఁ దండ్రియు వసింపఁ దానువకీలై*
*కళ్ళమద మెక్కినతనికి*
*గుళ్ళైనం గానరావు గువ్వలచెన్నా!*
తా.:
తనకు పుట్టుకను ఇచ్చిన తల్లిదండ్రులను ఎక్కడో వేరే వారి ఇంట్లో వుంచి తను పెద్ద చదువులు చదివి వకీలు అయి ధర్మం కోసం వాదిస్తూ వున్నాను అనుకుని కళ్ళు నెత్తకి ఎక్కిన మనిషికి గుడిలో వుండే పవిత్రతను కూడా గుర్తించలేడు ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*మనది ప్రభాత సమయంలో పక్కదిగుతూనే, మాతృ దేవోభవ, పితృ దేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పుకుని, మనకు జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు, విద్య బుద్ధులు నేర్పిన గురువులకు నమస్కరించుకుంటూ రోజు ప్రారంభించే జాతి. అటువంటి భారతదేశంలో పుట్టి, తల్లిదండ్రులను వేరొకరి దయాదాక్షిణ్యాల మీద వదిలే వేసే పుత్రులు ధనం కుప్పలు తెప్పలుగా సంపాదించినా, సమాజంలో గౌరవం పొందలేరు. తన కన్నవారి ఎడల ధర్మంగా నడచుకోలేనివారు, సమాజం పట్ల ధర్మంగా ఎలా వుండ కలుగుతారు. ఇవాళ సమాజంలో వృద్ధశ్రమాలు పెరగడానికి కారణం పెద్దవారి పట్ల అనురాగం తగ్గడమే. ఇవాళటి యువకుడు రెపు వృద్ధుడు అవుతాడు అనే ఇంగితాన్ని మనసులో వుంచుకుని, తమ కన్నవారిని ఆదరపూర్వకంగా చూచుకునే మంచి బుద్ది ప్రసాదించు పరమేశ్వర, పార్వతీ పతీ!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి