వేమన శతకం
అల్పుడెపుడుఁబల్కు నాడంబురముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుచుండును.
మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమునే మాటలాడును.
కంచు మ్రోగినంత పెద్దగా బంగారం మ్రోగదు కదా! అని భావం.
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడచూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకే విధంగా కనిపించును.
కానీ పరిశీలించి చూసినచో వాటి రుచులు, గుణములు
వేరు వేరుగా ఉండును. ఆ విధంగానే మానవులందరూ ఒకే విధంగా
అవయవ లక్షణములు, ఆకారములు కలియున్ననూ మామూలు
మనుషుల కంటే గొప్పవారి లక్షణములను పరిశీలించి
తెలుసుకొనగలిగినచో అవి విలక్షణముగా ఉండునని భావం.
గంగిగోవు పాలు గరిటెడైనా చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమా! మంచి ఆవు పాలు కొంచమైనా ఉపయోగంగా ఉండును.
కానివి కడవ నిండా ఉన్న గాడిద పాలు పని ఏమి? భక్తితో పెట్టిన భోజనం
కొద్దిగా అయినా చాలును కదా! అని భావం
సేకరణ:
రుద్రవరం రాజశేఖర్
10 వ తరగతి
జి.ప.ఉ.పా.వావిలాల
కరీంనగర్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి