"నీతి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
నీతినిపెంపొందించియు
నీతికథలసారమెపుడునియమమువిడకన్
నీతినిప్రేరేపించియు
నీతినిబాలలకుజెప్పినేర్పించవలెన్!!!

02.
కం.
నీతికికట్టుబడుండుము
నీతియెనీకొసగుశుభమునిలకడతోడన్
నీతియెప్రతిఫలమిచ్చును
నీతిగమెదిలిననుమేలునీకునుగల్గున్!!!

03.
కం.
నీతిపరుండనిలోకము
చేతనుగుర్తించబడియుసేవింపంగన్
మాతరముకు,మీతరముకు
నీతియెయన్నింటమేటినిలబడునుగదా!!!

04.
కం.
రామాయణభారతములు
నేమముతోభాగవతమునిష్ఠగచదువన్
సామాజికనీతివిలువ
లీమాదిరిపొందవచ్చునెల్లజనంబుల్!!!

కామెంట్‌లు