చదువు(గేయం);- కె.భాస్కర్, 8/బి తరగతి, TTWURJC(B)KONDAPUR,DHANWADA(MANDAL),NARAYANPET(DIST).పర్యవేక్షణ:డి. గాయత్రి, టి.జి.టి.తెలుగు.

 మేలుకో నిద్ర మేలుకో....ఓ ఓ ఓ
పుస్తకాన్నే పట్టుకో
చదువుకో నేడే చదువుకో...ఓ ఓ ఓ
నేడు చదువే నీ ఆయుధం 
                         " మేలుకో"
పదపదమని అడుగెయ్యి ముందుకు
చకచక చదివేసి జ్ఞానాన్ని ఆర్జించు
అఆఇఈ అంటూనే అంతరిక్షాన్ని చేరుకో
Abcd నేరుస్తూనే నింగిని ఏలవోయి పక్షిలా
సూటిపోటి మాటలతో నిలిచిపోకు ఒంటరిగా
అందరితో సై అంటూ కదలిపో తుఫానులా 
                       "మేలుకో"
కలమునే  చేతపట్టి అక్షరాలన్నీ రాసేయి
పుస్తకాన్ని ప్రేమిస్తూ జ్ఞానాన్ని పొందవోయి
చదువేమి విషనాగు కాదురా సోదరా
ఎందుకని భయపడి వెనకడుగు వేస్తావు
                           "మేలుకో"
కదలరా ముందుకు కదలరా బడినే ప్రేమిస్తూ ముందుకు సాగరా
చదవరా లోకాన్ని చదవరా...భారత పౌరునిగా చరిత్రలో నిలిచిపోరా
                           " మేలుకో"

కామెంట్‌లు