సెల్ ఫోన్లు,కంప్యూటర్లు వచ్చాక ఉత్తరాలు వ్రాసకోవడం మరుగున పడిపోయింది.ఇ- మెయిల్ లో వ్రాసుకోవడం,వాట్స్ ఆప్లో వ్రాసుకోవడంతో వ్రాత తగ్గిపోయింది.అందమైన అక్షరాలు కరవు అయిపోయాయి! నా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక తీగకు వచ్చిన ఉత్తరాలు తగిలించేవారు అదొక అనుభూతి అప్పుడప్పుడూ ఆ పాత ఉత్తరాలను తీసి చదువుతే ఏదో ఆనందం!
ఇప్పడు ఫోన్లలో పంపే సందేశాల్లో పొడి పొడి మాటలే,ఎబిసిడిల నొక్కుళ్ళే,తెలుగు కూడా ఆంగ్ల అక్షరాలతో! ఈమిటీ విపరీతం? కొందరు తెలుగులో సందేశాలు పంపుతున్నారు, అంతవరకు సంతోషం.అంతా గబ గబా క్లుప్త సందేశాలే!
ఈ మధ్య నా స్నేహితుడొకడు ఉత్తరం వ్రాశాడు.దానిని చూస్తే నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది.ఎందుకంటే చక్కటి అక్షరాలు,చక్కటి వాక్యాలు,ఉత్తరం ఆఖరున వాడు చదివిన కవితా పుస్తకంలోని ఓ కవిత! అందుకే ఆ ఉత్తరం అంత ఆనందం ఇచ్చింది.
మరొక మిత్రుడు అమెరికానుండి తన నాన్నకు ఉత్తరాలు వ్రసేవాడు,కంప్యూటర్,ఇ- మెయిల్ ఉన్నా ఆ విధంగా ఉత్తరం వ్రాయటం ఆయనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, ఆ ఉత్తరాలను పదీ పదే చదువుకోవడమే కాకుండా తన కొడుకు వ్రాసిన ఎన్నో మంచివిషయాలను నాకు చూపించి బహు ఆనంద పడేవాడు.ఏది ఏమయినా ఫోన్లు,కంప్యూటర్లు నిండి పోయినపుడు 'డిలిట్' చేస్తే ఆ మధుర మైన ఉత్తరం మాయమయి పోతుంది కదా!
ఇదండీ లేఖలు వ్రాస్తే వచ్చే ఆనందం.అందుకే బాష మరచిపోవద్దు.అక్షరాలు మరచిపోవద్దు. లేఖలు హృదయంతో వ్రాయండి.మీ భావాలు అక్షర రూపంలో పెట్టండి.
*********
ఉత్తరాలు రాసేద్దాం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి