సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 
శరీరం-2
 @పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిదే.  సిసిరో
@పుస్తకాలు లేని యిల్లు ఆత్మలేని శరీరం లాంటిది. జాన్ రస్కిన్
@బలం, రూపం, శుద్ధకంఠస్వరం, స్పష్టవర్ణోచ్ఛారణ, మృదుశరీరం, సువాసన, శరీరశుద్ధి, శోభ, లావణ్యం, ఇవి  శీలవంతులకు లభిస్తాయి.
@శరీరం ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం లాంటిది. ఎందుకంటే అందులో పరిశుద్ధ ఆత్మ నివాసం ఉంటుంది.  మహాత్మా గాంధీ
@శరీరం అంతటా వ్యాపించియున్న ఆత్మనాశనం లేనిదని గ్రహించాలి. శాశ్వతఆత్మను ఎవ్వరూ నశింపజేయలేరు. గీత
@శరీరం ఆత్మ నివసించే స్థానం.అది పుణ్యక్షేత్రంలా పవిత్రమైనది.
@శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఉల్లాసంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస
@శరీరం ఆలోచనలకు బానిస కనుక, ఆహారాన్ని మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదు, ప్రధానంగా ఆలోచన మార్చు. జేమ్స్ ఎలెన్ 
@శరీరం ఎంత దృఢంగా, ఎంత అందంగా ఉన్నప్పటికీ చివరకు మిగిలేది మూడు చేటల బూడిదే. 
@శరీరం బుద్ధిబలానికి వశమై వుండాలి. హక్స్ లీ
@శరీరం మట్టిలో, ఊపిరి గాలిలో కలిసిపోయేవే గాని స్థిరంగా వుండవు.
@శరీరం మమకారానికి, అహంకారానికి నిలయం. 
@శరీరం విస్తరి వంటిది, దీనిపై రుచికరపదార్థాలన్నీ పెట్టుకొని తింటాం. భోజనానంతరం విస్తరి జాగ్రత్త చేసుకుంటామా?  దాని పని @తీరగానే అవతలపారవేస్తాం.  శరీరమూ అంతే . రమణ మహర్షి
@శరీరం సింహానిది, హృదయం నక్కది అయినప్పుడు అలాంటి సింహాన్ని పిల్లికూడా తరిమివేస్తుంది. 
@ శ్రమవల్ల శరీరం దృఢంగా అయితే  కష్టాలవల్ల మానసిక పరిస్థితి పరిపుష్టమవుతుంది. సిసిరో

కామెంట్‌లు