సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 94410 65414. peddissrgnt@gmail.com

 విజయం
@ ఎందుకు ఈ పని చేస్తున్నాను?  దీని వల్ల ఫలితం ఏమిటి?  ఇందులో విజయం సాధించగలనా?అనే మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పనీ మొదలు పెట్టొద్దు. చాణక్య
@ ఏదీ అంతిమ విజయం కాదు.తదుపరి ఆశయం, లక్ష్యం ఎప్పుడూ ఉండాలి, దాని సాధన కోసమే కష్టించాలి. అబ్రహాం లింకన్
@ నీ లక్ష్యం ఏమిటో తెలుసుకొని పనిచేస్తే స్వావలంబన సాధిస్తావు. లక్ష్యం కాని దానిని అనుకుంటే ఏమి సాధించలేవు.
@ ఏనాటికైనా సత్యా నికే విజయం లభిస్తుంది, అసత్యానికి కాదు. మండూకోపనిషత్తు
@ ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపయినా విజయం తప్పదు. వివేకానంద

కామెంట్‌లు