@ఇల్లు యిచ్చినవానికీ, మజ్జిగ పోసిన వానికీ మంచిది.
@ఇల్లు లేనమ్మ హీనం చూడు , మగడు లేనమ్మ మానం చూడు.
@ఈతచెట్టు ఇల్లు కాదు , తాటిచెట్టు తల్లి కాదు.
@ఉండ ఇల్లు లేదు , పండ మంచం లేదు.
@కష్టపడి ఇల్లు కట్టి, కల్లుతాగి తగలబెట్టినట్లు.
@చుట్టతాగి చూరులో పెడితే ఇల్లు కాలిందట.
@చేను పండాలి , ఇల్లు నిండాలి.
@తినడానికి తిండి, కట్టుకోవడానికి దుస్తులు, ఉండటానికి ఇల్లు లేనివారిని పట్టించుకోక పోవడమే నిర్లక్ష్యం.
@ధనాన్ని వీటి నిమిత్తం వినియోగించాలి, తిండి, గుడ్డ, ఇల్లు, దైవసేవ, సాధుసేవ, బీదలసేవ.
@నిజ మిత్రులు నిన్ను చూడటానికి వస్తారు, నీ ఇల్లు చూడటానికి రారు. జెన్నిఫర్ విల్సన్
@మనం నివసించడానికి వుపయోగించే యంత్రాన్నే ఇల్లు అంటాం. లీ కార్బుసీర్
@మాయా మోహాలకి తావిచ్చేది ఇల్లు కాదు, మనిషి మనసు. ప్రేమ్ చంద్
@సవతులున్న ఇల్లు నరక సమానం.
@ సామెతలేని మాట , ఆమెత లేని ఇల్లు.
సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com-ఇల్లు-2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి