ఇల్లు-1
@ ఆపదలకు ప్రతిక్రియను ముందుగానే ఆలోచించుకోవాలి. ఇల్లు తగులబడుతుంటే బావి తవ్వటానికి ప్రయత్నించడం తెలివితక్కువ పని.
@ ఆలి ఏడ్చిన ఇల్లు , ఎద్దు ఏడ్చిన సేద్యం కలసిరావు.
@ ఆలి శుచి ఇల్లు చెబుతుంది.
@ ఇల్లాలు లేని ఇల్లు వ్యర్థమే, వింటినారి లేని విల్లు వ్యర్థమే. భర్తృహరి
@ ఇల్లు ఇరకటం , ఆలి మరకటం.
@ ఇల్లు ఎక్కి కోక విప్పిందట.
@ ఇల్లు కట్టి చూడు పెళ్ళిచేసి చూడు.
@ ఇల్లు కాలుతుంటే జల్లెడతో నీళ్ళుపోసినట్లు.
@ ఇల్లు కాలుతుంటే బావి త్రవ్వినట్లు.
@ ఇల్లు కావాలని కోరుకోవడం ఒక్క మనిషి లోనే కాదు, పుట్టిన ప్రతి జంతుజాలం లోనూ కనిపిస్తుంది . బి. వి. రామన్.
@ ఇల్లు చూచి ఇల్లాలిని చూడు.
@ ఇల్లు జానెడు , కర్ర మూరెడు.
@ ఇల్లు తీరు వాకిలి , తల్లి తీరు పిల్ల చెపుతాయి.
@ ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
@ ఇల్లు మింగే అత్తకు బజారు మింగే కోడలు.
సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి