సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు, 9441065414. peddissrgnt@gmail.com

 మాట-1
 
@ఆలి మాట విన్నవాడు ,  అడవిలో పడ్డవాడు ఒక్కటే.
@ఈటె పోటు మానుతుంది, మాట పోటు మానదు. ❖ఉపనిషత్తులు చెప్పే ఒకమాట నిర్భయత్వం.
@ఎదురు అన్నది మాట ,  ఎదాన పెట్టింది వాత. ❖ ఎర్రభూమి పంట ఒకనాటి మాట.
@ఏ మాటైనా ఆలోచించి మాట్లాడటం మంచిది.నోటికి వచ్చింది మాట్లాడటం చెడ్డ అలవాటు. 
@ఏటిగట్టు వారి మాట యెన్నడూ నమ్మరాదు. ❖ ఏటుకు ఏటు ,  మాటకు మాట.
@దేశప్రభుత్వం విదేశీ చేతిలో వుందంటే, ఆ దేశస్తులకు మాతృదేశం లేదు. సన్ యట్ సేన్
@కాలం గడిచి పోతుంది ,  మాట నిలిచిపోతుంది. ❖ 
@చెడును ఉపేక్షించే వాళ్లు మంచిని  నిర్లక్ష్యం చేస్తున్నారన్నమాట. టాల్ స్టాయ్
@చెప్పుడు మాటలు విని చెడిపోకండి. మందర మాట విని కైక తన భర్తను పోగొట్టుకుంది. 
@చెలి మాట తేనెల వూట.
@నలుగురూ నడిచిందే బాట ,  పలికిందే మాట.
@నాగరికంలేని మాట నాలుక తీట.
@నిలకడ లేని మాట నీళ్ళ మూట.
@నీతి లేని మాట రాతి వేటు.
@నీళ్ళ మూట ,  వంచకుడి మాట ఒక్కటే. ❖ నేర్చి చెప్పిన మాట విలువైన మాట.
@నేను గెలుస్తానో,లేదో మాటివ్వలేను.   కాని మాటకు కట్టుబడి ఉంటానని మాటివ్వగలను. 
@పొద్దు / పూట గడుస్తుంది గానీ మాట నిలచిపోతుంది. ❖ప్రజల మాట ప్రభువుకు కోట.
@ ప్రేమలేని మాట పెదవి పైనే. ❖ బయటొక మాట ,  లోపల యింకో మాట.
కామెంట్‌లు