👌"ఓం"కార మే శివము!
చైతన్యము! ప్రణవము!
పరం బ్రహ్మ రూపము!
ఓ తెలుగు బాల!
(తెలుగు బాల పదాలు., "శంకర ప్రియ.,")
👌"ఓం"కారమే.. మంగళ వాచకం. శుభంకర మైనది! కనుక, "సత్యము- శివము- సుందరం"! అది.. సచ్చిదానంద మయమగు పరంబ్రహ్మ స్వరూపము!
👌"ఓం"కారమే.. ప్రణవము! అది.. అకార- ఉకార- మకార- బిందు- నాదము లనెడు; అవ్యక్తము లైన ఐదక్షరములు కలది. కనుక, సూక్ష్మ పంచాక్షరి.. "ఓం"కారము! ఈ ఏకాక్షర మంత్రమును.. అనుదినము, నియమ నిష్ఠలతో.. జపించండి!
🔱ప్రార్ధనా పద్య రత్నము
( కంద పద్యము)
"ఓం"కారము నీ రూపము!
"హ్రీం" కారము నీదు శక్తి, హ్రీం బీజము తో
ఓంకార ముచ్చరింపగ,
ఓంకారము మిగుల శక్తియుత మౌను శివా!
(.. శ్రీ శివ శతకము, డా. శ్రీపాదుక., )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి